కరోనాకు మందు మన పల్లెల్లో మన ఇంటిముందు ఉన్న తీగా జాతి మొక్కల్లో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్య  పడక మానరు.కోక్యులస్ హిర్సుటస్ శాస్త్రీయ నామం తో పిలిచే మొక్క అదేనండి మన పల్లెల్లో  చీపురుతీగ, దూసరతీగ అని మనం పిలుచుకునే తీగ జాతికి చెందిన ఈ మొక్క ఇప్పుడు శాస్త్రవేత్తల్లో కరోనా కి విరుగుడు రూపం లో ఆశలు రేకెత్తిస్తోంది. గతం లో  చీపురుతీగ నుంచి తయారుచేసిన ఔషధాన్ని డెంగ్యూపై పరీక్షించగా కొంత మేరకు సత్పలితాలివ్వగా తాజాగా  ఈ మొక్కలు  కరోనా వైరస్ పై ఏ మేరకు విరుగుడుగా పని చేస్తానే విషయాలపై పరిశోధన చేయడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ లతలా పాకుతూ వెళ్లే  ఈ మొక్కల నుండి తీసే  ఔషధంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ ఔషధం పనితీరును అంచనా వేసేందుకు ప్రయోగాలు నిర్వహించాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి దరఖాస్తు చేసుకుంది. పరిమిత సంఖ్యలో 50 మంది రోగులపై పరీక్షలు జరిపి ఈ ఔషధం పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని  తెలుసుకోవాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. కోక్యులస్ హిర్సుటస్ నుంచి తయారుచేసిన ఔషధంలో యాంటీ వైరల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నందున డెంగ్యూపై ప్రాథమిక పరీక్షల్లో ప్రభావవంతంగా పనిచేసిందని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు తాము ఈ ఔషధాన్ని కరోనాపై ప్రయోగించేందుకు డీజీసీఐ అనుమతి కోసం చూస్తున్నామని, దీన్ని దేశంలోని గిరిజనులు వివిధ వైరస్ ల నివారణకు ఉపయోగిస్తుంటారని వారు వెల్లడించారు.ఒక వేళా ఈ మొక్క ఔషధం గా పనిచేస్తే రానున్న రోజుల్లో పల్లెల నుండి కరొనను తరిమి కొట్టొచ్చ్చనే విషయం బోధపడుతుంది.

You Might Also Like