1. ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో కరోనా విజృంబిస్తున్నప్పటికీ భారత్ లో దారుణం అనదగ్గ పరిస్థితి లేదు అనే చెప్పవచ్చు . సవాలు ఏదైనా భారత్ తన స్టైల్ లో సత్తా చాటుతుంది అనే విషయం తెలిసిందే అయినప్పటికీ ఇతర దేశ ప్రముఖుల నోట వినడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది .   భారత్ ప్రజలకు  రోగ నిరోధక శక్తి తక్కువే అయినప్పటికీ వారిలో మానసిక ఇమ్మ్యూనిటి ఎక్కువ అని చైనా లోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు జాంగ్ వెన్ హంగ్ అన్నారు .జాంగ్ వెన్ హంగ్ తన విద్యార్థులతో వీడియో క్లాస్ లో మాట్లాడుతూ భారత్ లో జరిగిన ఓ మతపరమైన సమావేశానికి హాజరైన ప్రజల్లో ఎవరూ కూడా మాస్క్లు ధరించకపోవడం వార్తల్లో చూశానని అప్పుడే భారతియులు మానసికంగా దృఢమైనవారని అర్థమైందని అయన అన్నారు .భారతీయులు ప్రశాంతమైన మనస్తత్వం కలిగిన వారని ,అమెరికా లో అంతగా కరోనా కేసులు పెరుగుతున్నా భారత్ లో తీవ్రత ఎక్కువగా కనిపించడం లేదని భారత్ లోని 90 శాతం ప్రజలని కరోనా ఎం చేయలేకపోవచ్చని అయినా తమ విద్యార్థులకు తెలిపారు .ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077 కాగా, మరణాల సంఖ్య 718కి పెరిగింది. భారత్ లోనూ కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నా, అది అమెరికా, యూరప్ దేశాలతో పోల్చితే ఏమంత ప్రమాదకరం కాదని జాంగ్ వెన్ హాంగ్ అభిప్రాయపడ్డారు. 

You Might Also Like