కరొనతో ప్రమంచమే వణికి పోతున్న వేళా ప్రజలకు ఇది నిజం  గా శుభవార్తే .కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే వెయ్యి రూపాయలకే కొవిడ్-19 వ్యాక్సిన్‌ను విక్రయిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవోఅదార్ పూనావాలా ప్రకటించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికా ఆధారిత బయోటెక్ కంపెనీ కోడజెనిక్స్‌తో కలిసి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని అదార్ పూనావాలా తెలిపారు. ట్రయల్స్ విజయం ఆధారంగా కరోనా వ్యాక్సిన్ నెలకు 10 మిలియన్లు ఉత్పత్తి చేస్తామని తెలిపారు.మేలో మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ట్రయల్స్‌ విజయవంతమైతే మొదటి ఆరు మాసాలు నెలకు నలభై నుంచి యాభై లక్షల డోసులను, ఆతర్వాత క్రమంగా నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేస్తామని, ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ. 1,140 కోట్లను వెచ్చిస్తున్నామని అయన కు తెలిపారు.ఏది ఏమైనా భారత దేశం నుండి దేశీయం గా అందరి కంటే ముందే వ్యాక్సిన్‌ ను తయారు చేసి ప్రజల ముందుకు ఉక్కు రావడం అభినందనీయమే .


You Might Also Like