ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టి 20 ప్రపంచకప్ పై అనిష్చితి కొనసాగుతూనేవుంది.కరోనా వైరస్ కారణంగా 

టోర్నీ వాయిదా వేయడం ఖాయం అన్న అభిప్రాయాల నేపథ్యంలో...ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం 

తీసుకుంటారని అంత భావించారు.అయితే టోర్నమెంట్ పై జులై లో నిర్ణయం తీసుకోవాలని బుధవారం 

జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఐసీసీ నిర్ణయించింది.టోర్నీ వాయిదాపడక తప్పదని ఇప్పడికే మాజీ,ప్రస్తుత 

ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు.


ఐసీసీ నిర్ణయంతో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.ఇందుకు సంబందించిన ప్రణాళికలు కూడా

సిద్ధం చేసింది .ప్రపంచకప్ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్ జరిపే ఆలోచేన్లొ బీసీసీఐ ఉంది.దీనిలో భాగంగా 

ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర క్రికెట్ అస్సోసియేషన్లకు సౌరవ్ గంగూలీ లేఖ రాసారు.అవసరమైతే 

ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలలో ఐపీఎల్ నిర్వహిస్తాం.ఆటగాళ్లు,అభిమానులు,ఫ్రాంచైజీలు,ప్రసరదారులు,

స్పాన్సర్లు ఈ సంవత్సరం ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సౌరవ్ గంగూలీ లేఖలో తెలిపారు.

ఖచ్చితంగా ఈసంవత్సరం ఐపీఎల్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

 

You Might Also Like