విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, తన సహచరుడు రామ్ నరేశ్ శార్వాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు యూట్యూబ్ లో కొన్ని వీడియోలను పోస్ట్ చేసిన గేల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో జమైకా తల్లావాస్ ను తాను వీడటానికి కారణం శార్వానేనని ఆరోపించారు. శార్వాన్ ఓ విషసర్పమని, వెన్నుపోటు పొడవడంలో సిద్ధ హస్తుడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా శార్వాన్ ప్రమాదకారని అభివర్ణించాడు.


కాగా, ప్రస్తుతం క్రిస్ గేల్ సెయింట్ లూసియా జౌక్స్ తరఫున సీపీఎల్ లో ఆడుతుండగా తనను తప్పించాలని జమైకా తల్లావాస్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడానికి శార్వాన్ కారణమని గేల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో శార్వాన్ దే పెద్ద పాత్రని ఆరోపించిన గేల్, తనను స్నేహితుడిగా పేర్కొంటూనే వెన్నుపోటు పొడిచారని, ఇప్పటికీ తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని అన్నారు.

 నువ్వు ఎప్పుడు మారతావు శార్వాన్? అసలు మారాలన్న ఆలోచన నీలో ఉందా? "అని గైల్ ప్రశ్నించాడు.జమైకాలో నా చివరి పుట్టిన రోజున మనిద్దరమూ కలసి ఎంత దూరం ప్రయాణించామో చెబుతూ పెద్ద ప్రసంగం కూడా దంచావు. నువ్వు ఓ పాము వంటి వాడివి. నీలో ప్రతీకారేచ్ఛ ఎంతో ఉంది. నువ్వు ఇంకా ఎదగలేదు

You Might Also Like