భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ  విషాదం లో మునిగి పోయాడు.అతడు ఎంతో ఇష్టపడేపెంపుడు కుక్క బ్రూనో బుధవారం  మరణించింది. ఈ విషయాన్నీ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపాడు. బ్రూనోతో గత 11 ఏళ్లుగా తనకు  ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశాడు. అతని భార్య అనుష్క శర్మ కూడా బ్రూనో ఆత్మకి శాంతి చేకూరాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.కరోనా వైరస్ కారణంగా కోహ్లీ ప్రస్తుతం ఇంట్లోనే తన కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా బ్రూనోతో కలిసి దిగిన ఫోటోను విరాట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.విరాట్ బిమానులు దీనికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంన్నారు.

You Might Also Like