భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈసారి ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఉవ్విళ్లూరుతుండగా కరోనా మహమ్మారి  అతని ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.కుల్దీప్ మాట్లాడుతూ నేను ఐపిఎల్ 2020 కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాను.గతం లో చేసిన తప్పులను పునారవృతం కాకుండా ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధం గా ఉన్నానని అన్నారు.

గత  ఐపిఎల్ నా ప్రదర్శన బాగా లేదనను , నేను బాగానే  బౌలింగ్ చేసాను కాని ఒక లెగ్ స్పిన్నర్ యొక్క సక్సెస్, అతను ఆ  ఆట లో తీసుకున్న వికెట్లపై ఆధారపడి ఉంటుంది. ఆ టోర్నీ లో నా బౌలింగ్ ఎకానమీ రేటు బాగా ఉన్నప్పటికీ నేను ఎక్కువ వికెట్లు తీసుకోలేకపోయాను. ఏ బౌలర్ అయినా  వికెట్లు తీసుకోనప్పుడు విశ్వాసం కోల్పోతారు. ఇది కాకుండా, ఒక మ్యాచ్‌లో నేను చాలా పరుగులు ఇచ్చాను, అది నా విశ్వాసాన్నిబాగా  దెబ్బతీసింది. 'అన్నాడు కుల్దీప్.కాగా కరోనా కారణంగా ఇప్పట్లో ఐపిఎల్ నిర్వహించే అవకాశం లేనందున్న త్వరలోనే ఐపీఎల్ నిర్వహించాలని అందులో కుల్దీప్ఎక్కువగా వికెట్లు తీసుకొనేవాలని ఆశిద్దాం.

You Might Also Like