భారత క్రికెట్ లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కన్నా రాహుల్ ద్రావిడ్ ప్రభావమే ఎక్కువని మాజీ ఓపెనర్

గౌతమ్ గంభీర్ అభిప్రాయ పడ్డారు.భారత క్రికెట్ అనగానే అందరు సౌరవ్ గంగూలీ లేదా ధోని గురించి

మాట్లాడుకుంటారని కానీ రాహుల్ ద్రావిడ్ పాత్రా కూడా చాల కీలకం అని గంభీర్ చెప్పుకొచ్చారు.సౌరవ్

గంగూలీ సారధ్యంలో వన్డేలో అరంగేట్రం చేసిన తాను రాహుల్ ద్రావిడ్ కాప్తన్సీ లో టెస్టు కెరీర్ని 

మొదలుపెట్టానని కానీ ఏ ఒక్కరు ద్రావిడకు క్రెడిట్ ఇవ్వటం లేదని కేవలం సౌరవ్ గంగూలీ విరాట్ 

కోహ్లీ ఎమ్మెస్ ధోని గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కానీ ద్రావిడ్ కూడా గొప్ప సారధి అనే విషయాన్నీ 

గ్రహించాలని టెస్టుల్లో ద్రావిడ్ ఓపెనింగ్ బాటింగ్ చేయమన్న చేసేవాడని అలాగే కీపింగ్ అలాగే 

ఫినిషర్ గ జట్టుకు అవసరమైన సమయంలో తన భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహించేవాడని

ఇలా భారత క్రికెట్ కి ఎన్నో చేసాడని తన దృష్టిలో భారత క్రికెట్ పై ద్రావిడ్ ప్రభావం ఎక్కువే అని

చెప్పుకొచ్చారు.ఒన్డే క్రికెట్  లో గంగూలీ ప్రభావం ఎక్కువే కానీ ఓవరాల్ క్రికెట్ లో అందరికన్నా ద్రావిడ్ 

ప్రభావమే ఎక్కువని సచిన్ టెండూల్కర్ నీడలోనే ఆడటంతో అతనికి దక్కాల్సిన గుర్తింపు కూడా

దక్కలేదు అని గంభీర్ చెప్పుకొచ్చారు.

You Might Also Like