భారత ప్రజలు క్రికెట్ దేవుడు గా భావించే  సచిన్ టెండూల్కర్ బార్బర్ గా కొత్త అవతారం ఎత్తారు.వేలాది పరుగులు సాధించిన బ్యాట్ పట్టిన చేతి తోనే  కత్తెర పట్టి ఎం చక్క  కటింగ్ చేసేశాడు.లాక్ డౌన్ వేళా బార్బర్ షాపులు మూసిఉండటం తో  పెరిగిన తన  కొడుకు అర్జున్ జుట్టు ను  కత్తిరిస్తుండగా భార్య అంజలి టెండూల్కర్ ఫోటోలు తీశారు. వీటిని సచిన్ సోషల్ తన ఇంస్టాగ్రామ్ మీడియాలో పోస్టు చేస్తూ  ఓ తండ్రి పిల్లల కోసం ఏదైనా చేయక తప్పదు ఏ అవతారమైన ఎత్తక తప్పదు అనే ట్యాగ్‌లైన్ ఇచ్చాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం, జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు హెయిర్ కట్ చేయడం కూడా ఇలాంటిదేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హెయిర్ కట్ ఎలాగున్నా, నువ్వెప్పటికీ అందంగానే ఉంటావు అంటూ తన కొడుకునుద్దేశించి పేర్కొన్నారు. ఈ పనిలో తనకు సాయంగా ఉన్న కూతురు సారా టెండూల్కర్‌కు సచిన్ థాంక్స్ చెప్పాడు.

You Might Also Like