లాక్ డౌన్ సమయంలో  చిరుతపులులు రోడ్లపైకి రావడం తో ప్రజలు బాయ భ్రాంతులకు గురవుతున్నారు.నిన్న హైదరాబాద్ లో నేడు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజిపేట తండా వద్ద చిరుతపులి సంచరించి  ముళ్లకంచెలో చిక్కుకుంది.దాన్ని పట్టుకోవాలనుకున్న పోలీసులను చిరుత  ముప్పు తిప్పలు పెట్టింది.గురువారం ఉదయం మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని రైతు పొలంలో చిరుత కనిపించింది.

పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెలో అది చిక్కుకుంది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించటంతో అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. రంగంలోకిదిగిన అధికారులు చిరుతపై వల వేసి మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది వారిపై దాడి చేసి తప్పించుకుంది. వలలో చిక్కినట్టే చిక్కుకుని తప్పించుకుపోయిన చిరుత.. ఫారెస్టు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచింది. పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.


అలాగే ఇనుప కంచెలో చిక్కుకోవడంతో చిరుతకు కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే అటవీ అధికారుల జీప్‌ కింద దూరిన చిరుత.. సృహా కోల్పోయింది. దీంతో అధికారులు చిరుతను బోన్‌లో బంధించారు. రెండు గంటలపాటు పోలీసులను, ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.మొత్తానికి చిరుతను బంధించిన సిబ్బంది హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

You Might Also Like