అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రిమాండ్‌ ఖైదీ ఆసుపత్రిలో ఎస్కార్ట్ కానిస్టేబుళ్లపై దాడి చేసి రివాల్వర్ తో పరారు కాగా ఆ ఖైదీ కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి కేసుల్లో  నిందితుడైన జీలకర్ర ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన మాక్లూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనారోగ్యం కారణంగా ఇటీవల అతడిని జైలు నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా పెట్టారు. శనివారం రాత్రి కానిస్టేబుళ్లపై దాడిచేసిన నిందితుడు ప్రసాద్ ఓ కానిస్టేబుల్ నుంచి రివాల్వర్  లాక్కుని పరారయ్యాడు.అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 

ఎన్కౌంటర్ చేయదనానికేనా 

జీలకర్ర ప్రసాద్‌ హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి కేసుల్లో  నిందితుడు కాగా అతడు జైల్లో కూడా తన ప్రవర్తన మార్చుకోకా పలువురిని బెదిరింపులకు గురిచేస్తుండగా నేర చరిత్రను మార్చుజోని ప్రసాద్ ను అంత మొందించాడానికే అతను పరారైనట్లు కథనం అల్లుతున్నారని తెలుస్తుంది.అందులో భాగం గానే మూడు రోజులుగా గాలిస్తున్నా అతడి ఆచూకీ లభ్యం కాలేదాని  అతడి వద్ద ఉన్న రివాల్వర్  లో పది రౌండ్లు ఉన్నట్టు సీపీ కార్తికేయ తెలిపారు. అతడికి కోసం గాలిస్తున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించినట్టు సీపీ పేర్కొన్నారు.మొత్తానికి అతడి వద్ద నున్న రివాల్వర్ తో కాల్పులు జరుపగా తాము తప్పించుకునేందుకు ఎదురు కాల్పులు జరిపినట్లు  కథనం అల్లేందుకే పోలీసులు పథకం వేసినట్లు తెలుస్తుంది.ఛిద్దం ఎన్కౌంటర్ ఎప్పుడు ప్రకటిస్తారో

You Might Also Like