ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న సంకల్పంతో ఆహా ఫౌండేషన్ సంస్థను   ప్రారంభించి పేదలకు సాయం చేస్తున్నామని అదే తమకు సంతృప్తి నిస్తుందని ఆ సంస్థ నిర్వహులు మహ్మద్ రఫీ  రాజేంద్రప్రసాద్ లు తెలిపారు.లాక్  డౌన్ నేపత్యం లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డుల ఆకలి తీర్చడానికి  ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యం లో అన్నం ప్యాకెట్లను నాలుగవ రోజు అందించారు. అలాగే వేములవాడ నుండి సిరిసిల్ల వరకు దారి పొడుగునా ఉన్న వృద్ధలకు ,యాచకులకు ఆహార పొట్లాలను అందించారు.రానున్న రోజుల్లో ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యం లో పేదలకు అండగా ఉండే పలు సహాయ కార్యక్రమాలు చేపడుతామని తమకు సంహరించిన అందరికి వారు ఈ సందర్భం గా కృతజ్ఞతలు తెలియజేసారు.కాగా తామే స్వయంగా వంట చేసుకుని ప్యాకెట్లను తయారు చేసుకుని క్రమశిక్షణతో వేములవాడ నుండి సిరిసిల్ల వరకు వెళుతూ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.

You Might Also Like