లాక్ డౌన్ సమయం లో ప్రజలకు కాంగ్రెస్  పార్టీ పక్షాన మేమున్నామని భరోసా కల్పించాలని కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలకులు కుంతియాలు కోరుతూ వేములవాడ నియోజకవర్గం లో  ఆదిశ్రీనివాస్  ప్రజలకు తానున్నానని భరోసా కల్పిస్తూ చేస్తున్న సాయాన్నివారు అభినందించారు.సోమవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,కుంతియా, పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ కృష్ణ లతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో  వేములవాడ నియోజక వర్గ ఇంచార్జ్ ఆది  శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో  నిరుపేదలను రేషన్ కార్డు లేని వారిని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆదుకోవాలని కోరనారు.వరి ధాన్యం కొనుగోలు ని వేగవంతం చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు.ధాన్యం కొనుగోలు పూర్తి అయి కొనుగోలు కేంద్రం నుంచి లారీ వెళ్ళిన తర్వాత తాలు పేరిట తేమశాతం పేరిట రైతులను ఇబ్బంది పెట్టకుండా పార్టీ పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు.రెడ్ జోన్ లో  ఉన్నటువంటి కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో వారికి సౌకర్యాలు కల్పిస్తూ వైద్య సేవలు అందించాలి వారిలో  భరోసా కల్పించాలని పార్టీ పక్షాన నిర్ణయం తీసుకోవాలని అది శ్రీనివాస్ కోరారు.You Might Also Like