కరోనా వైరస్ ను అరికట్టే క్రమంలో లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ తరుణంలో నిరాశ్రయులు, వృద్దులు ,పేదల ఆకలి తీర్చేందుకు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము సిద్ధం గా ఉన్నామని పేదల ఆకలి తీర్చడం సామాజిక బాధ్యత అని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు

వేములవాడ దేవాలయం వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో సోమవారం సాయంత్రం అయన పాల్గొని నిర్వాహకులను  అభినందించారు.అన్న దానం మహా దానమని కరోనా వాళ్ళ అనూహ్యం గా ఈ దుస్థితి వచ్చిందని ఇప్పుడే ప్రజారోగ్యం కాపాడవలిసిన బాధ్యత ప్రభుత్వం పై ,ప్రజలపైన ఉందని అన్నారు.ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంట్లోనో ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని అయన కోరారు

.ప్రభుత్వం బియ్యం సరఫరా చేయడం ద్వారా వలస కార్మికులకు,యాచకులకు మరింత అన్నదాన కార్యక్రమం చేపట్టే అవకాశముందని అన్నారు.పట్టన  ప్రజలుమినహా ఎవరైనా ఆకలి తో ఉంటె వారికి అన్న పానీయాలు అందించేందుకు తాము సిద్ధమని,వేములవాడ లోనే కాకుండా నియోజకవర్గం లో ఎక్కడైనా వలస కార్మికులు ఉంటె గుర్తిస్తే వారికి తానూ అన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నారు.ఈ కార్య క్రమం లో అన్న దాన నిర్వాహకులు ,కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ ,సంగ స్వామి,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like