కేంద్రం ప్రకటించిన వాట తేలే వరకు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడం అనాలోచిత చర్య అని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో  రాష్ట్రంలోని పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకోవడం సరి కాదు అని విమర్శించారు.కేంద్ర రాష్ట్రాల వాటాలను ఇప్పుడున్న దుర్భర స్థితిలో బేరీజు వేసుకోవడం తగదని వెంటనే  పేదలకు  ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు

You Might Also Like