అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితుల్లో చేయూతనివ్వాలని కాంగ్రెస్ నాయకుడు అది శ్రీనివాస్ కోరారు.పట్టణంలో శనివారం ఆది శ్రీనివాస్ తన  నివాసంలో లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి కష్టం గా ఉన్న 61 మందికి 11 రకాల నిత్యావసర సరుకుకులను పంపిణి చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు  ఉన్నవారికే సాయం చేస్తుందని ఇప్పటికి తెలుపు రేషన్ కార్డు లేని వారు ఎంతో మంది ఉన్నారని  వారికీ రేషన్ బియ్యం నగదు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వారందరికీ సహాయం అందించాలని అయన డిమాండ్ చేశారు.కష్టకాలం లో ఎవరు ఆకలి తో ఉండకూడదనే తనకు ఉన్న దాంట్లో పలువురికి సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆది యువసేన సభ్యులు ఎర్ర శ్రవణ్, ఆరిగేల శశాంక్, తాండ్ర సందీప్ రావు, ద్యావనపెల్లి రంజిత్ రావు, వెంగళ దినేష్ గౌడ్, బండ సాగర్, సచిన్, చిట్ల రాకేష్ లు పాల్గొన్నారు.


You Might Also Like