కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెబుతున్నటువంటి సూచనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఒకరికి ఒకరు పరస్పర దూరం పాటించాలని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల నుండి ఎవరు బయటకు రావద్దని, ప్రజలు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటించాలని తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లే వారు ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు.అందరు ఆరోగ్యం గా ఉండాలని అయన సూచించారు.

You Might Also Like