లాక్  డౌన్ నేపత్యం లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డుల ఆకలి తీర్చడానికి ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యం లో అన్నం ప్యాకెట్లను రెండో రోజు అందించారు.ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యం లో గత కొన్ని రోజులుగా పేదలకు వివిధరకాలుగా సాయం చేస్తున్నా ఈ సంస్థ కరోనా నేపత్యం లో అటు పేదలకు ఇటు విధి నిర్వహణలో ఉండి ఆహారం దొరకని వారి ఆకలి తీర్చడానికి ఈ కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహులు మహ్మద్ రఫీ గంప రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, తెలిపారు. విధి నిర్వహణలో వివిధ గ్రామాలలో చెక్ పోస్ట్ లలో పనిచేస్తున్న పోలీసులకు ఆహారం అందించడం పట్ల పోలీస్ ఆర్ ఐ సంపత్ ఆహా ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.

You Might Also Like