కరోనా వైరస్‌ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యం గా  ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చే ఆదేశాలు, సూచనలు, సలహాలను ప్రజలు శత శాతం పాటించాలని సీనియర్ టి  ఆర్ ఎస్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ఆయన కోరారు.పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి మన దేశం పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని అన్నారు..ప్రజలందరూ ఇంట్లోనే టీవీలో చూస్తూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులు, వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇతరత్రా పరిస్థితిని గమనించాలన్నారు.ప్రజలంతా అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్‌ను చాలా వరకు కట్టడి చేయొచ్చని .విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా  14 రోజుల పాటు క్వారం టైన్ లో  ఉండాలని .తాను కూడా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నట్లు ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి తెలియ చేశారు.

You Might Also Like