అన్నం పర బ్రహ్మ స్వరూపమని ఈ ఆపత్కాల సమయం లో అన్నార్థులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకురావాలని  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు.ఆదివారం వేములవాడ నియోజకవర్గం  రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో   లాక్ డౌన్ సందర్భంగా కార్మికులకు అన్నదానం చేశారు .దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రుద్రంగి లో కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఒరిస్సా మహారాష్ట్ర నుండి వచ్చిన 300 మంది వలస కార్మికులకు అన్నదాన నిర్వహించామని అన్నదానం పరబ్రహ్మ స్వరూపిణి అని అందరూ ఆకలితో అలమటించ కుండా ప్రతి ఒక్కరూ ఈ లాక్ డౌన్ సందర్భంగా అనాధలకు కార్మికులకు ఆదుకొని అన్నదానం పెట్టాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆయా ఆయా మండలాల్లో అనాధలను అక్కున చేర్చుకుని ఆకలి బాధలు తీర్చాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్  ప్రబలత మనోహర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరి గంగ మయ్య  మోహన్ రెడ్డి చిలకల తిరుపతి మల్లేశం మహిపాల్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ రెడ్డి దర్రా మల్లేశం  మాడిశెట్టి అభిలాష్ పల్లి గంగాధర్ సూర యాదయ్య గుగ్గిళ్ళ వెంకటేశం గంధం రాజ్యం  గణేష్ పల్లికొండ రెడ్డి అల్లూరి గణేష్ తదితరులు ఉన్నారు

You Might Also Like