కరీంనగర్ లో కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన కమ్యూనల్  వైరస్ ఉందని ఎంఐఎం అధినేత అసద్దుద్దిన్ చేసిన ట్వీట్ ఇప్పడు సంచలనం రేపుతోంది. కరీంనగర్ లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో ముస్లింలకు వైద్యం చేయమంటూ ఆ అసుపత్రి సిబ్బంది తెగేసి చెబుతున్నదని ఆరోపించిన అసదుద్దీన్ ఒవైసీ ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను కూడా ట్వీట్  చేశారు.కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గెలిచినప్పటి నుండి అసద్దుద్దిన్ కరీంనగర్ పై ఏదోకామెంట్ చేస్తూనే ఉండటం గమనార్హం.

You Might Also Like