టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత,ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య ఇవాళ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 68 ఏళ్లు. 2009, 2011లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మళ్లీ టీఆర్ఎస్ గూటికే చేరారు. కావేటి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కావేటి మృతి తో ఆసిఫాబాద్ లో విషాదం నెలకుంది.

You Might Also Like