కరోనా వ్యాప్తి నివారణకు మాస్క్ లు ధరించాలనే ఉద్దేశ్యంతో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో  డ్వాక్రా మహిళలు, మహిళా కార్యకర్తలతో మాస్క్ లు తయారు చేయిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మాస్కులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాస్క్ ల తయారీపై డెమో కార్యక్రమాన్నిసోమవారం  ఆయన ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ బస్తీల్లోని పేదలకు ఈ మాస్క్ లు అందజేస్తామని అన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలోప్రజావసరాలకు  అనుగుణంగా  భారతీయ జనతా పార్టీ  అద్వర్యం లో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంజయ్  తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తమ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఐదుగురు పేదలకు భోజనాలు పెడుతున్నారని అయన అన్నారు. బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని,  రక్తం అవసరం ఉన్న వారు తమ కార్యకర్తలను లేదా నేతలను  సంప్రదించాల్సిందిగా కోరారు.

You Might Also Like