కరోనా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ఉంటూ బయటకు వెళ్లే అవకాశం లేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రముఖ వ్యాపారి జిల్లా బిజెపి పార్టీ ఉపాఢ్యక్షుడు గోపు బాలరాజు ఆర్థిక సహకారం తో ఆయా వార్డులోని ప్రజలకు రీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేతులమీదుగానిత్యావసర వస్తువులు పంపిణి చేశారు.వేములవాడ పట్టణం లోని రెడ్ జోన్ పరిధిలో గురువారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ,నాయకులు ఎర్రం మహేష్,మల్లికార్జున్ కౌన్సిలర్లు బీజేపీ కౌన్సిలర్ ప్రతాప హిమబిందు, రేగుల సంతోష్ బాబు, బోనాల శివ తదితరులు లు ఆయా ప్రాంతం లో తిరుగుతూ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు.

You Might Also Like