హైదరాబాద్ నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. విధుల్లో ఉన్న ఆయనపై కర్రలతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు తలకు గాయాలయ్యాయి.ఇద్దరు వ్యక్తులు రాంగ్ రూట్ లో వస్తుండగా వారిని అడ్డుకున్నారని ఈ దాడికి పాల్పడ్డట్లు ప్రాథమిక సమాచారమందింది.సమాచారం అందుకున్న పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను హుటాహుటిన డి‌ఆర్డీఏ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు ఎందుకు దాడిచేశారు  విధులకు ఎందుకు ఆటంకం కలిగించి ఇలా దాడి చేశారు అనే విషయాలపై ఏసీపీ ఆరా తీస్తున్నారు. 

You Might Also Like