లాక్ డౌన్ వేళా జనసంచారం బయటకు రాకపోవడం వాహనాల రణగొణ ధ్వనులు లేక పోవడం తో వన్య మృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి.ఆకలికి అలమటింక దాహార్థికో గ్రామాలకు వచ్చి పశువులపై గొర్ల మండలపై దాడులు చేయడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల నిత్యా కృత్యమైంది.అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో చిరుత పులి సంచరించి  బండి భాస్కర్ అనే రైతు గొడ్ల  పాక  పై ఆదివారం రాత్రి  దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ఒక ఆవు మరణించినట్లు తెలుస్తోంది. దీనితో రైతు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు కోనరావుపేట మండలం, రుద్రంగి, వీర్నపల్లి, మూడు మండలాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ దాడితో రైతులు, మూడు మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వన్య ప్రాణుల సంచారం తో జనాలు బయటకు రావాలనుంటేనే హడలిపోతున్నారు.

You Might Also Like