కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం  చేపట్టిన లాక్ డౌన్ సందర్భంగా పేదల నిత్యావసర సరుకుల సరఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు తమ మద్దతు, విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సిఇఒ శ్రీ సత్యానాదెళ్ల సతీమణి శ్రీమతి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఎఎస్ అధికారి శ్రీ కే.ఆర్. వేణుగోపాల్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒక రోజు ములవేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శ్రీ కారం రవీందర్ రెడ్డి, శ్రీమతి మమత సీఎంకు అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఒకరోజు వెతనం రూ. 48 కోట్లు సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు నాయకులు చెప్పారు. సినీ హీరో నితిన్ రూ. 10 లక్షల చెక్కును సీఎంకు అందించారు. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు

  1. .

You Might Also Like