కరీంనగర్‌ రోల్ మోడల్ కమలాకర్ టీం ఐస్ ది బెస్ట్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వణికిస్తున్న కరోనా ఇండోనేసియా వాసుల రూపం లో జిల్లాకు వ్యాపించగా మొక్క వోణి దైర్యం తో జిల్లా యంత్రంగాన్ని ముందుకు నడిపి జిల్లాలో  వైరస్ కట్టడి చేసినందుకు  కమలాకర్ ను జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ అభినందించారు.గత రెండు రోజులుగా మిగతా జిల్లాలకు మార్గ దర్శకం గా  కరీంనగర్‌లో కరోనా కట్టడికి చేపట్టిన పలు అంశాలను ఉటంకిస్తూ సీఎం మంత్రి గంగులపై ప్రశంసలు కురిపిస్తున్నారని తెలుస్తుంది.

కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన పది మత ప్రచారకుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గతనెల 16న హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపించి వైరస్‌ జిల్లాలో వ్యాపించకుండా జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూ వారు పర్యటించిన ప్రాంతాలను గుర్తించి రెడ్‌జోన్‌గా ప్రకటించి వైద్య బృందాలను రంగంలోకి కమలాకర్ జిల్లా కలెక్టర్ శశాంక్  సహకారం తో ఇంటింటా సర్వే చేయించి అనుమానితులను హోం క్వారంటైన్‌ చేయించారు.రెడ్‌జోన్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేశారన్నారు.

మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తులను గుర్తించి క్వారంటైన్‌ చేయడంలోనూ వేగంగా స్పందించి వైరస్‌ వ్యాప్తి లేకుండా చేయడంతో మంత్రి చూపిన చొరవను సీఎం కేసీఆర్‌ తో పాటు తెలంగాణ టు డే ఆంగ్ల దిన పత్రిక ప్రత్యేకంగా తన వ్యాసం లోఅభినదించింది.. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదైన జిల్లాగా కరీంనగర్‌ మొదటి వరుసలో ఉన్నా క్రమంగా ప్రైమరీ కాంటాక్టులు జరగకుండా కఠినంగా వ్యవహరించిన  మంత్రి గంగుల కమలాకర్, తనకు సహకరించిన కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, నగర మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి సహకారంతో కరోనాను కట్టడి చేయగలిగిందని పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.

కరోనా వ్యాప్తి అనూహ్యంగా ఆగిపోవడంతో అందరి దృష్టి కరీంనగర్‌పై పడిందని కరీంనగర్‌లో అమలు చేసిన నిబంధనలనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకార్ వె ల్లడించారు. కరీంనగర్‌లో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్నే కరోనా పూర్తిగా నియంత్రణ అయ్యే వరకూ కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కాగా తెలంగాణ టు డే ఆంగ్ల దిన పత్రిక జిల్లాజనాలు బయటకు రాకుండా  కమీషనర్ అఫ్ పోలీస్ కమలాసన్ రెడ్డి వ్యూహాలు బాగున్నాయని అవి కరోనా వ్యాప్తిని నిరోదించడానికి తోడ్పడ్డాయని ప్రత్యేకం గా పేర్కొనటం గమనార్హం.మొత్తానికి జిల్లా లో కరోనా కట్టడి కుజరిగిందనే వార్త అందరికి శుభా వార్త కావడం ఇందుకు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్, తనకు సహకరించిన కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, నగర మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి లకు ప్రజల పక్షాన ఈరోజు దిన పత్రిక శుభాకాంక్షలు తెలియ జేజేస్తుంది.


You Might Also Like