కరోనా వ్యాప్తిని నిరోధించడంలో లాక్‌డౌన్‌ బాగా ఉపయోగపడిందని లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలని ప్రధా ని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారు.శనివారం   ప్రధాని  వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ  కరోనాపై జరిగే యుద్ధంగా భారత్‌ తప్పక గెలుస్తుందని మోదీతో కేసీఆర్‌ ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రాష్ట్రానికి కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరారు. అప్పులు, రాష్ట్రం చెల్లించాల్సిన నెలసరి చెల్లింపుల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలన్నారు.  రైతులు నష్టపోకుండా, నిత్యావసరాలకు ఇబ్బంది కలకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ నడిచేలా చూడాలన్నారు.వచ్చే ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని, రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిచేలా చూడాలన్నారు. వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాలని, కరోనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్‌బీఐ అనుసరించాలని, రాష్ట్రాలు చెల్లించే అప్పుల చెల్లింపుల్ని 6 వారాలు వాయిదా వేయాలని, ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ వేయాలని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అది నుండి చెబుతున్నట్లే కేసి ఆర్  లాక్ డౌన్ కె తన మద్దతు ప్రకటించారు.

You Might Also Like