కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే సరైన ఆయుధం అని దేశంలో లాక్ డౌన్ ను పొడిగించి  తీరాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రగతి భవన్ లో  విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన దేశంలో, రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందంటే అందుకు కారణం లాక్ డౌనే అన్నారు.  ప్రధాని అడిగితే లాక్ డౌన్ కొనసాగించాలనే చెప్పానని కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టం వాస్తవమేనన్నారు. రాష్ట్రానికి రూ 2,400 కోట్లు రావాల్సింది లాక్ డౌన్ కారణంగా కేవలం 6 కోట్లు వచ్చాయన్నారు. అయినా తప్పదు, ఆర్థికంగా నష్టపోతే కోలుకుంటాం కానీ ప్రాణాలు పోతే ఎలా అన్నారు.

బతికుంటే బలుసాకు  తినొచ్చు. ప్రాణాలు పోవడానికి వీలులేదని కేసీఆర్ పేర్కొన్నారు. బిసీసీ జూన్ 3 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని చెబుతోందని ఆయన అన్నారు.  ప్రపంచంలో 22 దేశాలు లాక్డౌన్ చేశాయన్నారు. కరోనా మన దేశంలో పుట్టింది కాదని చెప్పిన ఆయన విదేశాల నుంచి వచ్చిన 30 మందికి, వారి నుంచి వారి కుటుంబ సభ్యులు  20 మందికి కరోనా సోకిందన్నారు. మర్కజ్ నుంచి1089 మంది వచ్చారనీ, వారిలో 172 మందికి కరోనా వచ్చిందనీ, వారు మరో 93 మందికి అంటించారనీ వివరించారు.

కరోనాను ఎదుర్కోవాలంటే లాక్ డౌన్ ఒక్కటే ఆయుధమన్నారు.కరోనా నియంత్రణ విషయంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నట్లు  మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం కరోనా అన్న ఆయన దీనిని ఎదుర్కోవడంలో ప్రజలు సహకరిస్తున్న తీరు అద్భుతమన్నారు. శరీరంలో తక్కువ వైరస్ సోకిన వారు మాత్రమే బతుకుతున్నారనీ, మిగిలిన వారు అత్యంత దయనీయంగా మరణిస్తున్నారనీ కేసీఆర్ అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో నిద్రలేని  రాత్రులు గడుపుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.

కరోనాపై యుద్ధంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కేసీఆర్ ప్రశంసించారు. సఫాయన్నకు సలాం చేస్తున్నానన్నారు. పారిశుద్ధ్యకార్మికులకు వేతలంలో కట్ చేసిన 10 శాతం జీతాన్ని వెంటనే అందిస్తామని చెప్పారు. అలాగే వైద్యుల సేవలను ఎంతగా పొగడినా తక్కువేనని ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బందికి పది శాతం వేతనాన్ని గిఫ్ట్ గా ఇస్తామని చెప్పారు.

 

కరోనాపై వదంతులు వ్యాప్తి చేస్తే  చర్యలు తీవ్రంగా ఉంటాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటం ఖాయమన్నారు. అప్పుడు జరిగే  నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో ఆదాయం భారీగా తగ్గిపోతుందన్నది వాస్తవమే అయినా ఆర్థికంగా  నష్టపోతే పూడ్చుకుంటామనీ, ప్రాణాలు పోతే ఎలా అని ప్రశ్నించారు.

You Might Also Like