ప్రధాని మోడీ  చెప్పినట్లు ఒకేసారి లైట్లు స్విచ్ఛాఫ్‌ చేయడం వల్ల పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందన్నది    దుష్ప్రచారమేనని   తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ఇది ఐక్యతకు సంకేతమని చెప్పగా ఇలా చేయడం ప్రమాదకరమని, పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని సమర్థిస్తున్నాము  అన్నట్లు మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌రౌత్‌ కూడా ఇటువంటి ఆందోళననే వ్యక్తం చేశారు. 


దీనిపై స్పందించిన  సీఎండీ ప్రభాకరరావు ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ అటువంటి సమస్య ఏమీ ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని, కరోనాపై మనం విజయం సాధించేందుకు ఒక మోటివేషన్ గా  ప్రజలు బావిస్తూ ముందుకు రావాలని అయన పిలుపు నిచ్చారు. తెలంగాణ వరకు గ్రిడ్‌కు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అయన భరోసా ఇచ్చారు.

You Might Also Like