కోవిడ్-19 వైరస్ నియంత్రణ కోసం ఈ నెల 14 అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ ను ప్రకటిస్తూ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని అందువల్ల జిల్లా ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు, మెడికల్ సిబ్బందికి సంపూర్ణంగా సహకరిం చా లన్నారు.మెడికల్, ఫుడ్ మరియు నిత్యావసరాల దుకాణాలు, మీడియా తప్ప మిగతా మొత్తం ఈ నెల 14 అర్ధరాత్రి వరకు వంద శాతం బంద్ చేసి కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కదనానికి మీ వంతుగా ప్రజారోగ్యం కోసం తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ కోరారు.


మంగళవారం వేములవాడ పట్టణంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ లాకఁడౌన్ పరిస్థితులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు.కార్మికులు భిక్షాటన వృత్తిగా ఉన్న వ్యక్తులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు . ప్రభుత్వ నుంచి రేషన్ అందిందా...? అధికారులు మీ వద్దకు వచ్చారా భోజన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నిత్యావసరాల రేట్లు పెరిగాయా అంటూ వారిని ప్రశ్నించారు.


ప్రభుత్వ అధికారులు తమకు రేషన్ నిత్యావసర సరుకులు అందించాలని వారు కలెక్టర్ తెలిపారు.మున్సిపల్ అధికారులు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు నిత్యావసర వస్తువుల రేట్లు స్థిరంగా ఉన్నాయని కలెక్టర్ వారు తెలిపారు.లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి అధికారులు తమకు అన్నివిధాలుగా అండగా ఉన్నారని కలెక్టర్ కు తెలిపారు.వారి సమాధానంతో సంతృప్తి చెందిన జిల్లా కలెక్టర్ ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.


అనంతరం జిల్లా కలెక్టర్ వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు వైపున ఉన్న బి సి బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ సందర్శించారు.క్వారంటైన్ లో ఉన్న నలుగురు వ్యక్తుల తో మాట్లాడారు.ఇందులో కలెక్టర్ వెంట డాక్టర్ మహేష్ రావు ఉన్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సందర్శించారు.క్వారంటైన్ లో ఉన్న ఏడుగురు వ్యక్తుల తో మాట్లాడారు.క్వారంటైన్ కేంద్రంలో వసతులు బాగున్నాయా భోజన సదుపాయాలు బాగున్నాయని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్రంలో అన్ని వసతులు బాగున్నాయని అన్నారు.క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారు అధికారులకు ఇప్పటివరకు బాగా సహకరించారని, ఇకముందు కూడా ఇలాగే అధికారులకు సహకరించాలని కోరారు.

క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. వారికి సరైన సమయానికి భోజనం, తదితర సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాలలో విధులు నిర్వర్తించే వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.జనతా కర్ఫ్యూ పాటించిన తరహాలో లాక్ డౌన్ నిబంధనలను కూడా అంతే సీరియస్ గా ప్రజలంతా పాటించి ఈ నెల 14 వరకు ఇంట్లోనే ఉండాలని..కరోనా మహమ్మారిని కట్టడి కి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి ని కాదని ఎవరైనా కరోనా లాక్ డౌన్ నిబంధనలను, క్వారన్టైన్ నిబంధనలను ఉల్లంఘింస్తే పోలీసుల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.


అలాగే లాక్ డౌన్ పరిస్థితిని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని నిత్యావసర ధరలు పెంచినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరం అయితే సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.లాక్ డౌన్ సందర్భంగా ఈ నెల 14 అర్ధ రాత్రి వరకు ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని… అత్యవసరం.. నిత్యావసరం.. అయితేనే బయటకు రావాలని, ప్రయాణాలు చేయకూడదని కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ సూచించారుజిల్లా ప్రజలందరి ఆరోగ్యం కోసం అధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు, గ్రామ సిబ్బంది, వాలంటీర్లు, మండల, మునిసిపల్ఇ లా జిల్లా యంత్రాంగం యావత్తూ తో పాటు ప్రజల్లో అవగాహన కోసం మీడియా అందరూ ఎవరి స్థాయిలో వారు నిరంతరం బయట ఉండి విధులు నిర్వహిస్తున్నామని అన్నారు


సకల జనావళికి శ్రేయస్సు కోసం ప్రజలందరూ ఈనెల 14 వరకు బ్లాక్ టౌన్ కు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు సందర్శనలో కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, వేములవాడ తాసిల్దార్ నక్క శ్రీనివాస్, సి.ఐ శ్రీధర్ ,ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


You Might Also Like