ప్రాణాంతకమైన కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజల సంరక్షణే ధ్యేయంగా శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని కాంగ్రెస్ నేత  ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం 5 గంటలకు వేములవాడ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో  పట్టణంలోని వందమంది పారిశుద్ధ్య కార్మికులను శాలువలతో ఘనంగా సన్మానించి వారికి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం నిత్యం చెత్తను సేకరిస్తూ వేములవాడ పట్టణమంతా  పరిశుభ్రంగా ఉంచుతున్నారు.   ఈ విపత్కర సమయంలో వీళ్లు కార్మికులు కారని, దైవస్వరూపులుగా ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని వారి సేవలకు వందనాలు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ సంగె హనుమవ్వ, స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమురయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తూం  మధు, కనికరపు రాకేష్ ,మర్రిపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like