కష్టాలు వచ్చినప్పుడే మానవత్వం వెలుగులోకి వస్తోందని,కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే గుండె ధైర్యంతో పాటు మానవత్వం ఉన్న మనుషులు ముందుకొస్తేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం , వాసవి యువసేన , వాసవి నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో శుక్రవారం జాతర గ్రౌండ్ లో ఆపన్నహస్తంలకు, అభాగ్యులకు, నిరుపేదలకు, అనాధలకు ,చిన్నారులకు నిర్వహిం చిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్నదానం చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ మనం బాగుండడమే కాదు... మన చుట్టుపక్కల ఉన్నవారు,ఎలాంటి ఆశ్రయం లేనివారు, కష్టాల్లో ఉన్నవారిని సైతం ఆదుకోవ డానికి పెద్ద మనసు చేసుకోని యువత ,స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.లాక్‌డౌన్‌ జరిగినప్పటినుంచి ఆహారం లేక అవస్థలు పడు తున్న వారికి మేమున్నామంటూ ఆకలి తీర్చుతున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులను, వాసవి యువసేన ప్రతినిధు లను ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్లు వంగల దివ్య శ్రీనివాస్ , ఇప్ప్పపూల అజయ్ గారు మరియు లారీ  ఓనర్స్  యూనియన్ ప్రెసిడెంట్  ఎర్ర శ్రీనివాస్ ,వైశ్య సంఘం అధ్యకుడు కటకం జనార్దన్ ,  ప్రధాన కార్యదర్శి సిద్దంశెట్టి వేణు , నాయకులు దువ్వ విజయ్ ,సంతోష్ లు పాల్గొన్నారు.

You Might Also Like