లాక్ డౌన్ సందర్భంగా వేములవాడ పట్టణ నిరుపేద ఆటో కార్మికులకు నిత్య అవసరాల వస్తువుల కొనుగోలు కై  ఆటో కార్మిక నాయకులకు కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జీ ఆది శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేశారు.సోమవారం తన ఇంటిలో ఆటో కార్మికులకు పేదలకు నగదు అందజేసిన అనంతరం అది మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఆటో కార్మికులకు నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులను  ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అయన వెంట ఆటో యూనియన్ నాయకుడు సండ్ర గిరి శ్రీనివాస్ ఉన్నారు.

You Might Also Like