కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో మెలగాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం అయన ప్రజలకు  ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కరోనా వైరస్‌ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు, సూచనలు, సలహాలను ప్రజలు శత శాతం పాటించాలని ఆయన కోరారు.పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి మన దేశం పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు.ప్రజలందరూ ఇంట్లోనే టీవీలో చూస్తూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులు, వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇతరత్రా పరిస్థితిని గమనించాలి.ప్రజలంతా అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్‌ను చాలా వరకు కట్టడి చేయొచ్చు.విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా  14 రోజుల పాటు క్వారం టైన్ లో  ఉండాలి.తాను కూడా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నట్లు ఈ సందర్భంగా అయన తెలియ చేశారు.

You Might Also Like