తానూ చేసే పని చిన్నదైనా పలువురికి సాయం చేస్తూ తృప్తి పడతారు కొండారు.అలంటి కోవా కె వస్తాడు వంటల రాజేశం .వంటలు చేస్తూ ఉపాధి పొందుతూనే ఉన్న దాంట్లో పలువురికి సాయం చేయడం రాజేశం కు అలవాటు.పలు సార్లు పలుఫురికి సాయం చేసిన రాజేశం  వేములవాడ పట్టణంలో పలు చోట్ల కరోనా మహమ్మారి మూలంగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాడు.స్వయంగా స్కూటర్ పై బస్ స్టాండ్, గుడిముందు,కోరుట్ల బస్టాండ్ ,జాతర గ్రౌండ్లో ,బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ యాచకులకు, వృద్ధులకు, పేదలకు ఆహార పొట్లాలు అందించారు.


భిక్షాటన చేసేవారికి, పేద వారికి కరోనా ఆంక్షల మూలంగా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. తన వంతు సాయంగా కొందరికైనా ఆకలి తీర్చేందుకు రాజేశం తన మిత్రులతో కలిసి  ప్రతి రోజు మధ్యాహ్నం స్వయంగా తిరిగి ఆహార పొట్లాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ విధంగా మానవత్వం తో ఆహారం అందించేందుకు రాజేశం లా ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు.తెలంగాణ ఉద్యమం లో పలు కార్య క్రమాలు నిర్వహించి పలు సార్లు భోజనాలు అందించిన రాజేశం ఆ తరువాత పార్టీలకు దూరం గా ఉంటూ ప్రజా సేవ చేస్తున్నాడు.రాజేశం మాట్లాడుతూ తనకు ఉన్న దాంట్లో పేదలకు సాయం చేయడం తృప్తి గా ఉంటుందన్నారు.

You Might Also Like