రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో  మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదవాదం తో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశానుసారం వేములవాడలో సుభాష్ నగర్ ,ఉప్పుగడ్డ ప్రాంతాలను పోలీసులు వైద్య సిబ్బంది పూర్తి గా తమ అధీనం లోకి తీసుకున్నారు.ఆ ప్రాంతం లోకి ఎవరు రాకుండా బరిఖేడ్లు పెట్టి ప్రతి ఇంటిని పరీక్షిస్తున్నారు.జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వం లోని   పోలీస్ అధికారులు చంద్రకాంత్ ,శ్రీధర్ లు ప్రజలు బయటకు రాకుండా గట్టిబందో బస్తు నిర్వహిస్తున్నారు.


మల్లి వైరస్ సోకినా వ్యక్తి కలిసిన వారి బంధువులను కుటుంబ సభ్యులను మిత్రులను క్వారంటైన్ కు పంపేదుకు  డాక్టర్ మహేష్ రావు , సుమన్ మోహన్ రావ్ లు వైద్య సిబ్బంథి తో  ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావద్దని కలెక్టర్కో ఎస్పీ లు కోరుతున్నారు.కాగా వైద్య పరీక్షల్లో మొదట అందరికి నెగటివ్ రావడం ఇప్పుడు ఒకరికి పాజిటివ్ ఉందని ఉస్మానియా ఆసుపత్రి నిర్దారించడంతో అతనికి రోగ నిరోధక శక్తీ తగ్గడం తో వ్యాధి బయటకు వచ్చిందని మిగతా వారు పది రోజులు గా అతని కలిసి తిరగడం తో వారికి కూడా కరోనా ఉండచ్చని ప్రజలు అనుమానిస్తుండగా కరోనా సోకినా వ్యక్తిని  హైదరాబాద్ లో గాంధీ  ఆసుపత్రికి తరలించారు.వేములవాడలో కరోనా సోకినా వార్తా తో కలకలం సృష్టించింది


You Might Also Like