కరోనా నేపథ్యంలో  లాక్ డౌన్ సందర్భంగా పేదలకు దళిత మోర్చా అద్వర్యం లో శుక్ర వారం నాలుగవ రోజు అన్నదానం నిర్వహించారు.దళిత మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శంకర్ నేతృత్వం లో  వేములవాడ లోని పలు ప్రాంతాలలో పేదలకు అన్నదానం పిల్లలకువృద్దులకు వికలాంగులకు గుడ్లు పాలు అంద జేశారు.వేములవాడ పట్టణము లోని కట్ట కింద,పెట్రోల్ బంక్ వద్ద,దళిత వాడలో పేదలకు భోజనం వడ్డించారు.ఈ సందర్భం గా శంకర్ మాట్లాడుతూ కరోనా విపత్తు సందర్బంగా పేదలు పనిలేకా తిండి దొరకక అవస్థలు పడుతున్నారని ఇది గ్రహించియువకులు సేవాభావం తో ముందుకు  వచ్చి తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారని అన్నారు.అన్నదానం మహాదానమని ఇందుకు సహరిస్తున్న అందరికి ఆయన ఆ కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ నెల 14  వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అయన తెలిపారు.

You Might Also Like