తెలంగాణాలో ఆరుగురి మరణానికి కారణమై మరెంతో మందికి వైరస్ ను  వ్యాపింప చేసిన డి ల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వేములవాడ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్  గాంధీ ఆసుపత్రికి తరలించారు.వేములవాడ పట్టణానం లోని ఉప్పుగడ్డకు చెందిన ఒక యువకుడి ఇటీవల దుబాయ్ నుండి వచ్చాడని అనంతరం ఢిల్లీ,కేరళకు వెళ్లినట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక వైద్య సిబ్బంది ఆ యువకుడిని వైద్య పరీక్షలకు పంపి అక్కడే కారంటైన్ కు పంపినట్లు తెలుస్తుంది.స్థానికులు  అందిస్తున్న సమాచారం మేరకు ఆయా యువకుడు ఢిల్లీ లోని మర్కజ్లో ప్రార్థనలు జరిపాడని కేరళ లో వివిధ ప్రార్థన మందిరాలకు వెళ్లాడని చెబుతుండగా అతనికి కరోనా ఉన్నది లేనిది పరీక్షా తరువాత తెలుస్తుందని ఆ తరువాతే అతడి వేములవాడలో ఎక్కడెక్కడ తిరిగాడాన్నా  విషయాలను పరిశిలిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. 

You Might Also Like