హైదరాబాద్ నగరం లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మద్యం మత్తులో కారు నడుపుతున్నవ్యక్తి వేగం గా వచ్చి పడిపోయాడు.డివైడర్‌ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సీట్‌బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. మద్యం తాగిన మైకంలో యువకుడు కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు.కేసునమోదు చేసుకుని దర్యాప్తు శేస్తున్నారు.

You Might Also Like