తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణఇంకా  కొనసాగుతోంది. శనివారం  రాష్ట్రంలో మొత్తం 43 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు అందులో  దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 272కు చేరింది. ఈ రోజు ఉదయం వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 229గాఉండగా రాత్రి వరకు 272  కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియ జేస్తుంది.. తెలంగాణలో ఇప్పటివరకు 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ప్రాంతాల్లోనే బాధితులు అధికంగా ఉన్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 228 చికిత్స పొందుతుండగా 11 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.


రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల చెప్పారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మరో రెండు రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ల్యాబుల్లో 24 గంటల పాటు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఐదు లక్షల ఎన్-95 మాస్క్‌లు, 5 లక్షల ఐపీఈ కిట్‌లు, 5 లక్షల వైరల్ ట్రాన్స్‌మిషన్‌ కిట్‌లు, 500 వెంటిలేటర్లు, 4 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్క్‌లు, 25 లక్షల హాండ్ గ్లౌస్‌లు కొనుగోలు చేసినట్టు ఈటల చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల నమోదైన పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారిని కలిసిన వారివిగా నిర్ధారించినట్లు మంత్రి పేర్కొన్నారు.You Might Also Like