ఇల్లు గడవటం కష్టం గా ఉన్న ఆ తండ్రికి కూతురు జబ్బుకు గురవడం తో చేసేదేంలేక అప్పు చేసి విదేశాలకు ఉపాధి కోసం వలస బాట పాట్టాడు.అయినా అతన్ని కష్టాలు వీడియో కాల్ ద్వారా కూతురు అంతిమ సంస్కారం చూసినా ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు.వివరాలోకి వెళితే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన పాలాజీ భాస్కర్ సునీతల కూతురు సాహిత్య(11) గత కొంతకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతుంది.

దీంతో వైద్యం చేయిస్తుండడంతో, అప్పులు అధికమై భాస్కర్ ఉపాధినిమిత్తం ఎడారిబాట పట్టాడు. ఇంతలో ఆ పాప ఆరోగ్యం విషమించి మృతిచెందింది. తండ్రికి విషయం తెలిసినా రాలేని నిస్సహాయస్థితిలో వీడియోకాల్ లో చూపిస్తూ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఎడారి బాట పట్టిన భాస్కర్ జీవితం మొత్తం దుఃఖసాగరమే తప్ప ఏనాడు సంతోషం ఎరుగని ఆ నిరుపేద గల్ఫ్ కార్మికుడు, రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డా కన్నబిడ్డను కాపాడుకోలేకపోయానని కనీసం చివరి చూపుకైనా నోచుకోలేనని కుమిలిపోతున్నాడు.

ముందే గల్ఫ్ దేశం దానికి తోడుగా ఇప్పుడు కరోన వేటు అక్కడ ఉండలేక, ఇక్కడికి రాలేక తను పడే మనోవేదన అంతా ఇంతా కాదు. ఎలాగైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబానికి అండగా నిలిచి, భాస్కర్ ను ఊరికి రప్పించి ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులను మనసున్న మనుషులను కోరుకుందాం.

You Might Also Like