పండుగ పూట  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్  మండలం అంకుశాపూర్ అటవీ ప్రాంతంలో  విషాదం నెలకుంది.తమ ప్రేమకు పెద్దలు అడ్డొస్తారని భయపడి బుధవారం ఒక ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మధ్యాహ్నం పశువులను మేపడానికి వెళ్లిన వ్యక్తులకు చెట్టుకు వేలాడుతూ ఉన్న యువతీ యువకుల శవాలు కనిపించాయి. దాంతో వారు స్థానికులు సమాచారం అందించారు.ఈ మేరకు పోలీసులకుఅక్కడకు చేరుకొని చెట్టుకు వేలాడుతున్న శవాలను దించి పోస్ట్ మార్టంకు పంపినట్లు కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ప్రేమ జంటలో యువతి కొత్త సార్సాలా గ్రామానికి  చెందిన శైలజ గా యువకుడు బిబ్రా గ్రామానికి చెందిన దుర్గం సంతోష్ గా స్థానికులు గుర్తించారు. వీరిద్దరూ ప్రేమ జంట అని స్థానికులు తెలిపారు. ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు తెలియాల్సి ఉంది.

You Might Also Like