రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దన్న ప్రభుత్వ సంకల్పానికి అందరూ చేయూతనివ్వాలని ప్రజలకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.కరీంనగర్ గణేష్ నగర్ లో వ్యాపార వేత్త భద్రు కిమాని ఆధ్వర్యంలో ఆదివారం 100 మందికి మంత్రి  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం భగత్ నగర్ లో 300 మందికి చికెన్ బిర్యానీలు అందజేశారు.ఈ సందర్భం గా మంత్రి గంగుల మాట్లాడుతూ  రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దన్న ప్రభుత్వ సంకల్పానికి అందరూ చేయూతనివ్వాలని అన్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నవారెవరూ కూడా ఆకలికి, ఇతర వసతులు లేక ఇబ్బంది పడొద్దని సీఎం కేసీఆర్‌ అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని వర్గాలవారు సహకరిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు, వీధి బాలలు, దినసరి కూలీల వంటి వారిని ఆదుకునేందుకు దాతలు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునిల్ రావు, కార్పొరేటర్లు లెక్కల స్వప్న -వేణు, కొలిపాక అంజయ్య, జికె యూత్ నాయకులు పొన్నం రాజు, తెరాస నాయకులు దుద్దేల శ్రీధర్. చంద్ర మౌళి , జంగపల్లి కుమార్, పున్న సంపత్, కెమసారం తిరుపతి, చొక్కారం చంద్రం, తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like