దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడిన వారిని కాపాడేందుకు వైద్యులు, నర్సులు తమ శక్తినంతటినీ ధారపోస్తూ, రేయింబవుళ్ళూ శ్రమిస్తున్నారు. అనేక మంది వైద్యులు ఇళ్ళకు పోవడంమానేశారు. తమ భార్యాపిల్లలను చూడటం మరచిపోయారు. కేవలం కరోనా రోగులకు వైద్య సేవలు అందించడంలోనే నిమగ్నమయ్యారు.

అలాంటివారిలో వేములవాడ పట్టణానికి  జయప్రకాశ్ నారాయణ్ ఒకరు. ఈయన వేములవాడ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చెందిన ల్యాబ్ టెక్నీషియన్ పని చేస్తున్నారు. కరనా వైరస్ బారిన తమ ఆస్పత్రిలో చేరే వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. అలా గత ఐదు రోజులుగా ఆయన విధుల్లోనే నిమగ్నమయ్యారు.

ఢిల్లీ లోని మర్కజ్మ గంజ్ ప్రాంతానికి ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వేములవాడ యువకులను  అదుపులోకి తీసుకుని వారిని క్వా రంటైన్ పంపిన వైద్యాధికారి మహేష్ రావు బృందం లో ఈయన సభ్యుడు.ఇంటి దగ్గరే ఆసుపత్రి ఉన్నప్పటికీ  తన భార్యాపిల్లలను చూసేందుకు ఇంటికి వెళ్లారు. కానీ, ఇంట్లోకి వెళ్లలేదు. ఇంటి వాకిట్లోనే నిల్చొనే తన కుటుంబ సభ్యులను ముఖ్యం గా తన మనవరాలిని దూరం గా చూస్తూనే పాలు తాగారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.ఆ తరువాత తమకు కేటాయించిన దేవాలయ గదికి వెళ్లి స్నానం చేసి అదే బట్టలు ఉతుక్కుని నిదురపోయారు. హ్యాట్సాఫ్ టు జయప్రకాశ్ నారాయణ్ .


You Might Also Like