హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాని ఇష్టపడిన యువతి తనను విడిచి వెళ్లిపోవడంతో  మనస్తాపం చెంది ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ తానుంటోన్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.  సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం చంద్రకిరణ్‌ (32) మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తూ ఓ యువతితో రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. బేగంపేటలో నివాసమున్న చంద్రకిరణ్‌ ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌కు మకాం మార్చారు. కాగా 25 రోజుల ఆ యువతి చంద్రకిరణ్‌ను వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం సోదరుడు రాకేష్‌ ఫోన్‌చేస్తే ఎత్తకపోవటంతో అనుమానం రావడంతో వచ్చిచూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలం దొరికిన ఆత్మహత్య లేఖలో 'ఆ అమ్మాయి లేనిదే నేను బ్రతకలేనని'' రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


You Might Also Like