సైఫాబాద్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ కావడం తో  హైదరాబాద్ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.దీంతో ఆ స్టేషన్లో పని చేసే 12 మంది సిబ్బంది క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన ఎక్కడికీ ప్రయాణించలేదని తెలుస్తోంది. పోలీసు శాఖలో, అందులోనూ హైదరాబాద్‌లో పని చేసే హెడ్ కానిస్టేబుల్‌కు కోవిడ్ సోకడంతో తెలంగాణ పోలీసు విభాగం అప్రమత్తమైంది.కాగా తెలంగాణ పోలీసు విభాగంలో నమోదైన తొలి కేసు ఇది ఇంతకు ముందు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డీఎస్పీగా పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగి రాగా కొడుకు నుంచి సదరు అధికారికి ఇన్ఫెక్షన్ సోకింది.

You Might Also Like