అకారంణంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై  కేసులు నమోదు చేస్తాం

                                కరీంనగర్‌ ‌పోలీస్‌ ‌కమీషనర్‌ ‌విబి కమలాసన్‌రెడ్డి


కరోనా వైరస్‌వ్యాప్తి నేపధ్యంలో అమలవుతున్న  లాక్‌డౌన్‌, ‌రాత్రి వేళల్లో కర్ఫ్యూ నిబంధనలు కఠినతరంగా అమలుచేస్తూ పోలీస్‌శాఖ కమీషనరేట్‌వ్యాప్తంగా పకడ్భందీ చర్యలను తీసుకుంటున్నదని, అనవసరంగా రోడ్లపై వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ ‌పోలీస్‌ ‌కమీషనర్‌ ‌విబి కమలాసన్‌రెడ్డి అన్నారు. ద్విచక్ర వాహనం పై ఒకరు, కార్లు, ఇతర వాహనాల్లో ఇద్దరు మాత్రమే నిత్యావసర వస్తువుల నిమిత్తం బయటకు రావాలని, మెడికల్‌షాపుల్లో మందుల కొనుగోలు,అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని స్పష్టం చేశారు. 

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా సడలింపులు ఇచ్చిన  సమయాల్లోనే నిత్యావసర వస్తువులు, మెడికల్‌ ‌షాపుల్లో  మందులకొనుగోలు కోసం రావాలన్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు వద్ద సామాజికదూరం పాటించాలని తెలిపారు.  సామాజికదూరం పాటించకుండా జనంగుంపులుగా ఉండే సూపర్‌మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, కిరాణం దుకాణాల వద్ద యజమానులు జనాలు సామాజికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే సదరు దుకాణాల వద్ద జమకూడిన ఉన్న ఫోటోలు,వీడియోలను తీసి వాటిని సాక్ష్యంగా స్వీకరించి కేసులను నమోదు చేయడంతోపాటు సదరు దుకాణాలను మూసివేస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు మార్చి 22నుండి ఈనెల 07వరకు అకారణంగా రోడ్లపైకి వచ్చిన 2564 వాహనదారులపై కేసులు నమోదు, వాహనాలను సీజ్‌చేయడంతోపాటు  జరిమనాలు విధించడం జరిగిందని చెప్పారు. ఇందులో ద్విచక్ర వాహనాలు 2236, త్విచక్రవాహనాలు 257, చతుచక్రవాహనాలు 70, ఇతరవాహనాలు ఉన్నాయని,మరో 2640 వాహనదారులకు ఈ-చలాన్‌ద్వారా జరిమానాలు విధించడం జరిగిందని, మొత్తం వాహనాల  సంఖ్య ఇప్పటి వరకు 5204కు చేరిందని వివరించారు.

అలాగే లాక్‌డౌన్‌  అమలులో భాగంగా నిబంధనలు ఉల్లఘించిన 10మందితోపాటు, హోమ్క్వారంటైన్‌/ఐసోలేషన్‌ ‌నిబంధనలను అతిక్రమించిన 04గురిపై కేసులను నమోదుచేశామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ‌లక్షణాలు కలిగిఉన్నట్లు అనుమానాలు తలెత్తిన వారిని హోమ్ క్వారంటైన్‌ ‌చేయడంతోపాటు, వారి ఇళ్ళను జియోట్యాగింగ్‌ ‌చేశామని తెలిపారు. జియోట్యాగింగ్‌ ‌ద్వారా వారు బయటకు వెళ్ళినా వెంటనే సమాచారం నేరుగా కమాండ్‌కంట్రోలన్‌నకు చేరుతుందని చెప్పారు.  లాక్‌డౌన్‌ అమలులో భాగంగా సడిలింపులను  ఇచ్చిన నిర్ణీత సమయాల్లోనే అవసరాల నిమిత్తం బయటకు రావాలని,  పనిపూర్తయిన వెంటనే ఇళ్ళలోకి వెళ్ళి స్వీయనిర్భంధాన్ని పాటించాలని కోరారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నిరోధించేందుకు సామాజికదూరం పాటించడంతోపాటు వైద్యుల సూచనలు, జాగ్రత్తలను పాటించాలని చెప్పారు.  


You Might Also Like