తాము శాంతిభద్రతల పరిరక్షణ విధులకు మాత్రమే పరిమితంకాదు. పరిస్థితుల తీవ్రతను బట్టి మానవతాహృదయంతో స్పందించి సేవలందిస్తున్నామంటూ మరోసారి చాటి చెప్పారు  కరీంనగర్‌ ‌కమీషనరేట్‌ ‌పోలీసులు. పురిటినొప్పులతో బాధపడుతున్న  మహిళను పెట్రోలింగ్‌ ‌వాహనంలో బుధవారం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. లాక్‌డౌన్‌లో భాగంగా కరీంనగర్‌లోని అజ్మత్‌పురా ప్రాంతంలో బందోబస్తు విధులను నిర్వహిస్తున్న కమీషనరేట్‌ ‌విఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ‌కరుణాకర్‌రావు, సిబ్బంది పురిటినొప్పులతో బాధపడుతున్నదనే సమాచారాన్ని అందుకుని, సత్వరం స్పందించి  తమ పెట్రోలింగ్‌ ‌వాహనంలో సదరు గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. గర్భిణిని ఆసుపత్రకి తరలించిన ఎస్‌ఐ ‌కరుణాకర్‌రావు, కానిస్టేబుల్‌ ‌ప్రశాంత్‌, గార్డులు సత్తయ్య, ఖలీలను పోలీస్‌ ‌కమీషనర్‌ ‌విబి కమలాసన్‌రెడ్డి అభినందించడంతోపాటు వారికి రివార్డులను ప్రకటించారు. 


You Might Also Like